Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తమిళ .. మలయాళ .. భాషల్లో ఇక చక్రం తిప్పేది వీరే!

Heroines Special
Advertisement
  • మలయాళంలో దూసుకుపోతున్న అనశ్వర రాజన్ 
  • రీసెంట్ హిట్ గా నిలిచిన 'రేఖా చిత్రం'
  • తమిళ సినిమాలతో బిజీగా ఉన్న అనికా సురేంద్రన్ 
  • లైన్లో ఉన్న పెద్ద ప్రాజెక్టులు 
  • కాబోయే స్టార్స్ జాబితాలో కనిపిస్తున్న పేర్లు   

Advertisement
 గతంలో ఎప్పుడూ లేనంత వేగం ఇప్పుడు తమిళ .. మలయాళ భాషా చిత్రాలలో కనిపిస్తోంది. కొత్త కొత్త దర్శకులు రంగంలోకి దిగిపోయి, కంటెంట్ పరంగా .. టెక్నాలజీ పరంగా కథలను పరిగెత్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో యువ కథానాయికలకు విపరీతమైన డిమాండ్ పెరిగిపోతోంది. ఆల్రెడీ పరిచయమైపోయిన బ్యూటీల మార్కెట్ అంతకంతకూ పెరుగుతూ పోతోంది. నిన్నమొన్నటి వరకూ స్టార్ హీరోయిన్స్ వెలిగిన స్థానాల్లోకి యంగ్ బ్యూటీలు వచ్చి చేరిపోతున్నారు. 

ఈ నేపథ్యంలో ఇప్పుడు మలయాళంలో అనశ్వర రాజన్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. 15వ ఏటనే ఇండస్ట్రీకి వచ్చిన ఈ అమ్మాయి, వరుస సినిమాలతో బిజీ కావడానికి ఎక్కువ సమయం పట్టలేదు. మమ్ముట్టి - మోహన్ లాల్ వంటి సీనియర్ స్టార్ హీరోలతో కలిసి నటించిన అనశ్వర, ఇప్పుడిప్పుడే హీరోయిన్ గా తన పరుగును పెంచింది. సన్నగా .. నాజూకుగా కనిపించే ఈ అమ్మాయికి ఇప్పుడు యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. రీసెంటుగా వచ్చిన 'రేఖా చిత్రం' బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఆమె కెరియర్ గ్రాఫ్ నెక్స్ట్ లెవెల్ కి చేరుకుంది.    ఇక కోలీవుడ్ విషయానికి వస్తే అనికా సురేంద్రన్ పేరు బాగా వినిపిస్తోంది. అనికా బాలనటిగా అనేక చిత్రాలలో నటించింది. నటన పరంగా అనేక అవార్డులను గెలుచుకుంది. టీనేజ్ లోకి అడుగుపెట్టిన తరువాత హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తెలుగులోను 'బుట్టబొమ్మ' అనే సినిమా చేసింది. ముద్దుగా బొద్దుగా కనిపించే ఈ అమ్మాయి, ఎలాంటి పాత్రనైనా చేయగలదనే మార్కులను ఎప్పుడో కొట్టేసింది. ప్రస్తుతం తన చేతిలో పెద్ద ప్రాజెక్టులే ఉన్నాయి. భవిష్యత్తులో మలయాళంలో అనశ్వర .. తమిళంలో అనికా చక్రం తిప్పడం ఖాయమనే టాక్ బలంగానే వినిపిస్తోంది మరి.

Advertisement
Advertisement
Anashwara Rajan
Actress
Anika Surendran
Kollywood

More Telugu News